ఉదయ్ పూర్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ

మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరోయిన్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కొద్దిరోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిదే. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. ఇప్పుడు ప్రీ సెలబ్రేషన్ ముగిశాయి. మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫ్లైట్ లో ఉదయ్ పూర్ కి పయనం అయింది. దీనికి సంబంధించిన పిక్ ని నిహారిక తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో పెళ్లివేడుక జరగనుంది. మెగా ఫ్యామిలీ, టాలీవుడ్ ప్రముఖులు అంతా నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఉదయపూర్ కి పయనం కానున్నారు.