టీమిండియా మరో ధోని దొరికాడు.. ఇక కావాల్సింది మరో యువరాజ్’నే !
టీమిండియాకు హార్ధిక్ పాండ్యా రూపంలో మరో ధోని దొరికాడు. ధోని మాదిరిగా మ్యాచ్ ని ముగించడంలో స్పెషలిస్ట్ అనిపించుకుంటున్నాడు. ఆసీస్ తో రెండో టీ20లో ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్స్ బాది జట్టుని విజయతీరాలకి చేర్చాడు. ఇక గెలిచిన తర్వాత కూడా ధోని మాదిరిగా కామ్ గా ఉన్నారు. అయితే ధోని తనకి పోలార్డ్ ఆదర్శమని మ్యాచ్ అనంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ని ఎలా ముగించాలో అతనిని చూసే నేర్చుకున్నాని తెలిపారు.
ఈ విషయం పక్కనపెడితే.. టీమిండియా హార్థిక్ రూపంలో మరో ధోని లాంటి ఆటగాడు దొరికాడు. ఇక కావాల్సింది మరో యువరాజునే. నెం. 4 స్థానంలో సమర్థుడైన ఆటగాడు కావాలి. ఆ స్థానం కోసం శ్రేయస్ అయ్యార్, సంజూ శాంసన్ తదితరులు పోటీ పడుతున్నారు. కానీ వారు ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. టాప్ ఆర్డర్ విఫలమైన… యువ రాజ్ సింగ్ ల మ్యాచ్ లని నిలబెట్టాలి. అతి త్వరలోనే మరో యువరాజ్ కూడా టీమిండియాకు దొరకాలని ఆశిద్దాం.