బిగ్‏బాస్‏కు థ్యాంక్స్ చెప్పిన బోల్డ్ బ్యూటీ


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది అరియానా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. సోలోగా ఆడటం అరియానా ప్రత్యేకత. ఆమె ఆట తీరుకు హోస్ట్ నాగ్ కూడా ఫిదా అయిపోయాడు. అరియానా ఇతరులని డిఫెన్స్ చేయడంలో దిట్ట. అయితే ఈ బోల్డ్ బ్యూటీ సోమవారం ఏపీసోడ్ లో సింగిల్ గా కెమెరా ముందుకొచ్చి ఎమోషనల్ అయింది.

తనకి టైటిల్ గెలవాలనే ఉంది. కానీ గెలుస్తానో లేదో తెలియదు. అయినా.. ఈ షోకి రావడానికి, ఇందులో ఇన్నాళ్లు ఉండటం తనకు చాలా గొప్ప. ఇదో రాజ్యభవనంలా ఉంది. నేనేంటో, ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. అలాంటిది.. తనకి బిగ్ బాస్ ఓ అద్భుతంలా ఉంది. థ్యాంక్యూ బిగ్ బాస్ అంటూ ఎమోషనల్ అయింది. ఇక మహిళా సభ్యుల్లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న అరియానా టాప్ 5 లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.