బీజేపీలో విజయశాంతికి కీలక పదవి !

కాంగ్రెస్ మహిళా నేత, సీనియర్ హీరోయిన్ విజయశాంతి సోమవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని రాములమ్మ ప్రకటించింది. అయితే అందుకోసం పోరాటం చేయాలంటే.. ఓ పదవి ఉండాలి కదా. మరీ.. బీజేపీలో విజయశాంతికి ఎలాంటి పదవి లభించనుంది ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తెలంగాణ భాజాపా రాష్ట్ర కమిటి బలంగా ఉంది. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో డీకే అరుణ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజాపా మహిళా విభాగం బాధ్యతలని విజయశాంతికి అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు విజయశాంతిని తెలుగు రాష్ట్రాల రాజకీయాల కంటే ముందు తమిళ రాజకీయాల్లో వాడుకోవాలని భాజాపా అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. అతి త్వరలోనే విజయశాంతికి కీలక పదవి కట్టబెట్టనున్నారని చెబుతున్నారు. అదేంటీ ? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.