సన్నాలకు మద్దతు ధర.. కేంద్రమే అడ్డుపడుతుంది : కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రైతులు సన్నాలని పండించారు. అయితే ఇప్పుడు వాటికి మద్ధతు దొరక్క తీవ్ర నిరాశలో ఉన్నారు రైతన్నలు. సన్నాలకు కూడా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు సన్నాలకు మద్దతు ధర అంశం ప్రతిపక్షాలకి ఓ అస్త్రంగా తయారైంది. సన్నాలని పండించమని రైతులని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు వాటిని కొనక రైతులని మోసం చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సన్నాలకు మద్దతు ధర ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, అడ్డుపడుతున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని కేటీఆర్ ఆరోపించారు. మరీ.. కేటీఆర్ ఆరోపణలపై తెలంగాణ భాజాపా నేతలు ఏ విధంగా స్పందిస్తారు ? అన్నది చూడాలి.
సన్నాలకు మద్దతు ధర ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, అడ్డుపడుతున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
– టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS #TRSWithFarmers pic.twitter.com/KcOl5n0W11
— Thirupathi Bandari (@BTR_KTR) December 8, 2020