శృంగారతారగా అనసూయ

హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ శృంగారతారగా మారనుంది. సిల్క్ స్మిత బయోపిక్ లో నటించనుందనే వార్తలు వినిపించాయి. ఈ ప్రచారం జరగడానికి అనసూయ ఇచ్చిన హింట్ నే కారణం. హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల అనసూయ ఫొటో పోస్ట్ చేసింది.

‘మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం. తన ఈ కొత్త లుక్‌కు సిల్క్ స్మిత రిఫరెన్స్’ అని ఇన్ స్టా గ్రాములో పోస్ట్ పెట్టింది.లిప్ స్టిక్ పెదాలు, చేతులకి గాజులు, చీరకట్టుతో అచ్చం సిల్క్ గా కనిపించింది. దీంతో అనసూయ సిల్క్ గా మారనుంది. ఇక అందాల ఆరబోత.. ఓ రేంజ్ లో ఉండనుందని భావించారు. ఈ ప్రచారం హీటెక్కితే.. తనని శృంగారతారని చేసేస్తారని భావించిన అనసూయ.. తాను సిల్క్ బయోపిక్ లో కనిపించడం లేదని క్లారిటీ ఇచ్చింది. మరీ.. సిల్క్ లా ఎందుకు కనిపిస్తున్నారన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టేసింది.