బెన్ స్టోక్స్‌ ఇంట్లో విషాదం 

ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌కు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మృతి చెందారు. స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్(65) బ్రెయిన్ కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది తీవ్రం అవ్వడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

గెరార్డ్ స్టోక్స్ వర్కింగ్ టౌన్ క్లబ్‌కు మాజీ ఆటగాడు. ఆయన మరణ వార్తను క్లబ్ వర్కింగ్ టౌన్ ధృవీకరిచింది. కోచ్ గెరార్డ్ స్టోక్స్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఆయన కుటుంబానికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.