నిహారిక పెళ్లి వేడుకల్లో చిరు, పవన్ స్టెప్పులు !

ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో మెగా పెళ్లి సందడి మొదలైంది. ఈరోజు రాత్రి నిహారిక మెడలో జొన్నల గడ్డ చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు. ఈ వేడుక కోసం రెండ్రోజుల ముందు మెగా ఫ్యామిలీ ఉదయ్ పూర్ కి చేరుకుంది. సోమవారం సాయంత్రం పిల్లలతో కలిసి పవన్ కల్యాణ్ కూడా పెళ్లి సెలబ్రేషన్స్ లోజాయిన్ అయ్యారు. దీంతో సెలబ్రేషన్స్ పీక్స్ చేరాయి.

మెహందీ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. చిందులేశారు. మెగాస్టార్ చిరంజీవి బంగారు కోడిపెట్ట సాంగ్ కి స్టెప్పులేశాడు. పవన్ కంప్లీట్ డ్యాన్స్ ఫెర్ ఫామెన్స్ ఇవ్వకున్నా… చిన్నపాటి మూమెంట్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడీ దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.