ఏపీలో ప్రతి నెల పోస్టుల భర్తీ

ఏపీలోని నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ప్రతి నెలా పోస్టుల భర్తీకి సీఎం జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టాలని..  ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిర్ణయింది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2.60 లక్షల వాలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అందులో 5,154 గ్రామ వలంటీర్‌ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్‌ పోస్టులు ఉన్నట్టు తెలిపారు. మరోవైపు 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తూ సచివాలయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.