అభిమానులని ఖుషి చేసిన పవన్ తనయుడు

మెగా హీరోయిన్ నిహారిక వివాహ వేడుకలు ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య వేడుకగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్‌లో మంగళవారం సాయంత్రం పవన్‌-ఆయన తనయుడు అకీరా తళుక్కున మెరిశారు. మెగా ఫ్యామిలీ ఫోటో సెషన్ లో పవన్ ఆయన తనయుడు అకీరా ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం ఆకట్టుకుంది.

పవన్ కొంటె చూపులు.. సిగ్గుపడుతున్నప్పుడు చిందించే చిద్విలాసం.. ఈ రెండు ఎక్స్‌ప్రెషన్స్‌కి అమ్మాయిలు మనసు పారేసుకుంటారు. పవన్‌ కెరీర్‌లోనే పేరుపొందిన చిత్రాల్లో ఒకటైన ‘ఖుషి’లోని పలు సన్నివేశాల్లో.. భూమికతో కొంటెగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. తాజాగా పవన్‌కల్యాణ్‌ కుమారుడు అకీరా సైతం అచ్చం తండ్రిలానే హావభావాలు పలికించి అభిమానుల్ని ఆకర్షించారు. పవన్  ఆయన తనయుడు అకీరా సేమ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.