తమిళ నటి అనుమానాస్పద మృతి


తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో ఉరివేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి చిత్ర ఈవీపీ ఫిల్మ్ ‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. హోటల్ గదిలోనే తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌లో చిత్ర నటించారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. అయితే చిత్ర హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసి.. ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. నిజంగానే చిత్రది ఆత్మహత్యా ? లేక హత్యా ?? అనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇక చిత్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.