‘తిమ్మరుసు’ టీజర్ టాక్

విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “తిమ్మరుసు”. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్ న్యాయం కోసం వాదించే న్యాయ వ్యాధిగా కనిపించారు. స్టోరీ లైన్ ఏంటన్నది రివీల్ చేయకుండా.. సస్పెన్స్ మూడులో టీజర్ ని కట్ చేశారు. ఓ కేసులో న్యాయం గెలవాలని సత్యదేవ్ తాపత్రపడటం.. ఇందుకోసం పరిశీలన, పరిశోధనలు చేయడం.. టీజర్ చివర్ల్లో గన్ పట్టియాక్షన్ లోకి దిగడం చూడొచ్చు. మొత్తానికి తిమ్మరుసు టీజర్ ఆకట్టుకునే ఉంది.