అభిజిత్ క్లారిటీ అదుర్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరు ? అత్యధికులు చెప్పే పేరు అభిజిత్. సామాన్య ప్రేక్షకులు, సెలబ్రిటీలు అభిజిత్ కి ఓటేస్తున్నారు. అతనే ఎందుకు అంటే ? అతడికి ఫుల్ క్లారిటీ ఉందని చెబుతున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ ఇంట్లో అభిజిత్ ఫిజికల్ గా చేసేందేమీ లేదు. ఫిజికల్ టాస్క్  ల్లో మెప్పించింది లేదు. కానీ మెంటల్ గా అతడు చాలా స్ట్రాంగ్. ప్రతి విషయాన్ని చాలా క్లారిటీతో చెబుతుంటాడు. అతడిలో సున్నితమైన కామెడీ యాంగిల్ కూడా ఉంది. గురువారం ఏపీసోడ్ లో అది బయటపడింది. నేటి బిగ్‌బాస్ ఏపీసోడ్ లో ఏకాగ్రత అనే మ‌రో టాస్క్ ఇచ్చాడు.

ఇందులో కంటెస్టెంట్లు ఏదైనా ప‌ని చేస్తూ 30 నిమిషాలు లెక్క‌పెట్టాల్సి ఉంటుంది. మిగ‌తావాళ్లు ఆ వ్య‌క్తిని డిస్ట‌ర్బ్ చేయొచ్చు. ఈ క్ర‌మంలో అభిజిత్ త‌న‌లోని కామెడీ టైమింగ్‌ను బ‌యట పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డున్న‌వాళ్ల‌లో ఎవ‌రిని శివ‌గామితో పోలుస్తావు ? హారిక ప్రశ్నించగా.. శివ‌గామిలో ఉన్న అందం మోనాల్‌కు ఉంది, శివ‌గామిలో ఉన్న టెర్ర‌ర్ అరియానాకు ఉంది. శివ‌గామిలో ఉన్న ప్రేమ హారిక‌కు ఉందని తెలివైన సమాధానం చెప్పాడు. దీంతో అభిజిత్ క్లారిటీ అదుర్స్ అని చెప్పుకొంటున్నారు.