అంజన్ కుమార్ యాదవ్.. వార్నింగ్ ఇచ్చారా ? రిక్వెస్ట్ చేశారా ??
టీపీసీసీ కొత్త అధ్యక్షుడు ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ హైదరాబాద్ లో తిష్టవేసి.. నేతలతో చర్చలు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు తమ పీసీసీ పోస్ట్ కావాలని బాహాటంగానే కోరుతున్నారు.
ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి తనదేనని భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి నమ్మకంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సారి బీసీలకి అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత వీహెచ్ కోరుతున్నారు. శ్రీధర్ రెడ్డి, భట్టి తదితరులు లోలోపల తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
అయితే హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అంజయ్ కుమార్ యాదవ్ మాత్రం తనకి పీసీసీ పదవికి ప్రమోట్ చేయాలని కోరుతున్నారు. అందుకోసం నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో అంజన్ కుమార్ యాదవ్ ద్విముఖ వ్యూహాంతో ఉన్నట్టు తెలుస్తోంది. తనకి ప్రమోషన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్న అంజన్ కుమార్ యాదవ్.. అదే సమయంలో నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. పీసీసీ పోస్ట్ దక్కలేదన్న సాకుతో బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమేనని సమాచారమ్.