కరోనా వాక్సిన్.. మందు బాబులకి బ్యాడ్ న్యూస్ !
కరోనా వాక్సిన్ వచ్చేస్తోంది. మరో కొన్ని వారాల్లోనే వాక్సిన్ ని పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో జనవరి రెండో వారం నుంచి కరోనా వాక్సిన్ పంపిణీ ఉంటుందని చెబుతున్నారు. కరోనా వాక్సిన్ వస్తుందని అందరు సంతోషిస్తుంటే.. మందు బాబులు మాత్రం దిగాలు చెందుతున్నారు. ఎందుకంటే ? కరోనా వాక్సిన్ తీసుకుంటే మధ్యానికి దూరంగా ఉండాలి. ఈ మేరకు రష్యా అధికారులు ఆ దేశ ప్రజలని హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు నెలల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలని వారి దేశ పౌరులను హెచ్చరిస్తున్నారు అధికారులు.
స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి 42 రోజులు రష్యన్లు అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా తాజాగా తెలిపారు. మద్యం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.