తెలంగాణలో జనవరి 2వ వారం నుంచి కరోనా టీకాలు

మహమ్మారి కరోనాకు చెక్ పెట్టే టైమ్ దగ్గరపడింది. కరోనా టీకాలు రెడీ అవుతున్నాయ్. మరో రెండు మూడు వారాల్లోనే కరోనా టీకాలు అందుబాటులోకి రానున్నాయ్. ఇక తెలంగాణలో జనవరి రెండో వారం నుంచి కరోనా టీకాలు ఇవ్వనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ముందుగా నాలుగు విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల్లో 80 లక్షల మందిని ఇప్పటికే గుర్తించామని శ్రీనివాసరావు తెలిపారు. ఒక కోటి 60 లక్షల టీకాలు సిద్ధం చేసే  పనిలో ఉన్నాం.  జనవరి రెండో వారం‌ నుంచి టీకాలు  వేయటం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి రెండు డోసుల్లో టీకాలు వేయాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. కరోనా టీకా 9 నుంచి 12 నెలలు పని చేయనుందని తెలిపారు.