ఇద్దరు టాలీవుడ్ కమెడియన్స్ హౌస్ అరెస్ట్
టాలీవుడ్ కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి హౌస్ అరెస్ట్ అయ్యారు. అలాగని వీరిద్దరు ఎలాంటి ఆందోళనకి పిలుపునివ్వలేదు. రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు ప్రయత్నాలేమీ చేయాలేదు. తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో సంచలనంగా ఏమీ మారలేదు. మరెందుకు వీరిద్దరుని హౌస్ అరెస్ట్ చేశారు అంటారా ? ఇది సినిమా టైటిల్.
వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా టైటిల్. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ఇద్దరు హీరోగా టర్న్ తీసుకున్నారు. విజయాలు అందుకున్నారు. అలాగని కామెడీ చేయడం మానేయలేదు. తమకు తగ్గ కథ వస్తే.. హీరోగా మారి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. సప్తగిరి అయితే ఏకంగా స్టార్ హీరోల రేంజ్ లో యాక్షన్ లోకి దిగిపోతున్నారు.
ఇక హౌస్ అరెస్ట్ విషయానికొస్తే.. ఈ చిత్రానికి ’90ఎంఎల్’ దర్శకుడుశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అదుర్స్ రఘు, రవి ప్రకాష్, సునన్యాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘హౌస్ అరెస్ట్’కు ఈరోజే పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కామెడీ ఫుల్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ గా చంద్రబోస్ పాటలు రాయనున్నారు.