కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఇవే.. !
కొత్త పార్లమెంట్ భవనానికి నేడు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 2022 నాటికి ఈ భవనం అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలని చూస్తే..
* కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ హాల్‌లో 888 మంది, రాజ్యసభ హాల్‌లో 384 మంది ఎంపీలు కూర్చునే అవకాశం
* ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగితే మొత్తం 1,224 మంది ఎంపీలు కూర్చునేలా ఏర్పాట్లు
* నిర్మాణ ప్రాజెక్టును రూ.971 కోట్లకు దక్కించుకున్న టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
* ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో, త్రికోణాకృతిలో కొత్త భవనం
* గ్రాండ్ కాన్‌స్టిట్యూషన్ హాల్, ఎంపీల కోసం ప్రత్యేక లాంజ్, గ్రంథాలయం, వివిధ పార్లమెంటరీ కమిటీలకు ప్రత్యేక కార్యాలయాలు
* భోజనశాల, విశాలమైన పార్కింగ్, ప్రతీ ఎంపీ కోసం ప్రత్యేక కార్యాలయం
* ఇప్పటివకు కేవలం మంత్రులకు మాత్రమే కార్యాలయాలు.. కొత్త భవనంలో ఎంపీలకు కూడా
* ఎంపీల కార్యాలయాల కోసం శ్రమ శక్తి భవన్ ఉన్న ప్రాంతంలో ప్రత్యేక భవన నిర్మాణం
* పార్లమెంట్ నిర్మాణంలో ప్రత్యక్షంగా 2,000 మంది, పరోక్షంగా 9,000 మంది పాల్గొంటారని అంచనా