కొత్త జంట కొత్త పిక్.. వైరల్ !


నిహారిక కొణిదెల కాస్త నిహారిక జొన్నలగడ్డగా మారింది. బుధవారం రాత్రి 7:15 నిమిషాలకి నిహారిక ఇంటిపేరు మారింది. ఈ శుభముహూర్తాన నిహారిక మెడలో చైతన్య మూడు ముడులు వేశాడు. ఏడు అడుగులు నడిచారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అయితే పెళ్లి తర్వాత ఈ కొత్త జంట దిగిన ఓ ఫోటో ఒకటి బయటికొచ్చింది. వైడ్ అండ్ వైట్ లో ఉన్న.. ఈ పిక్ ఆకట్టుకుంటోంది.

ఇక మూడ్రోజుల పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, తేజు.. స్టెప్పులేశారు. పవన్ కల్యాణ్ పిల్లలతో కలిసి పెళ్లి వేడుకకి హాజరయ్యారు. పెళ్లి జరిగే వరకు మండపం దగ్గరలోనే ఉన్నారు. బహుశా.. పవన్ ఇంత ఓపికగా ఓ వివాహ వేడుకలో ఉండటం ఇదే తొలిసారి కావొచ్చు.