ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయింది ?
ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయింది ? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ఇస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం.. ఏపీపీఎస్సీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదన్నారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు అయిందన్నారు. ప్రిలిమ్స్ పరీక్షా పత్రంలో 51 తప్పులు వచ్చాయని.. ఈ మేరకు నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక లేని తీరు వల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని మండిపడ్డారు. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.