సామ్, నయన్ రూమర్.. క్లారిటీ వచ్చేసింది !

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా ‘కాతువక్కుల రెండు కాదల్‌’ అనే తమిళ సినిమా ప్రకటన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నయనతార, సమంతని హీరోయిన్స్ గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా నుంచి సామ్ తప్పుకుంది. దానికి కారణం నయనే. ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ నే దర్శకుడు కావడంతో.. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటోంది. అది నచ్చకే సామ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఈరోజు క్లారిటీ వచ్చింది.

తాజాగా ‘కాతువక్కుల రెండు కాదల్‌’ సినిమా షూటింగ్‌ గురువారం ప్రారంభమయ్యింది. పూజా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్‌ను చిత్రంలో నటిస్తున్న నటీనటులను ట్యాగ్‌ చేసింది. అలా ట్యాగ్‌ చేసిన వాటిల్లో నయన్‌ పేరుతోపాటు సమంత పేరూ ఉంది. దీంతో సామ్‌,నయన్‌ రూమర్స్ కి చెక్ పడినట్టయింది.