తెలంగాణ కాంగ్రెస్ బీసీ పాట
తెలంగాణ బీజేపీ బీసీ పాట అందుకుంది. సూపర్ హిట్ అయింది. ఏకంగా తెరాసకు ప్రత్యామ్నాయం అనిపించుకుంది. తెలంగాణ భాజాపా బీసీలకు.. ముఖ్యంగా మున్నూరు కాపులకి పెద్ద పీఠ వేస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలంతా బీసీలే. మున్నూరు కాపులే. ముదిరాజులు ఉన్నారు. తెలంగాణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కీలక నేతలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్.. తదితరులు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.
తెలంగాణలో అత్యధికంగా మున్నూరు కాపులు, ముదిరాజులని ఆకట్టుకోవడంలో వారు సఫలీకృతం అయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల, గ్రేటర్ ఎన్నికల్లోనూ భాజాపా బీసీ కార్డ్ పనిచేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి సీఎం అవుతాడు. తెరాస తెలిస్తే రావు సీఎం అవుతాడు. కానీ బీజేపీ గెలిస్తే మున్నూరోడు సీఎం అవుతాడని ఆ సామాజిక వర్గం ఒక్కటవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రక్షాళన జరుపుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా బీసీలకు పెద్దపీఠ వేయాల్సిన పరిస్థితి. కొత్త పీసీసీ ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి సీనియర్లతో సంప్రదింపులు జరుగుతున్నారు. ఈ సారి బీసీలకి అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత వీహెచ్ అంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. అంతకంటే ముందు సీనియర్ నేతలని బుజ్జగించాల్సి ఉంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. వారు శాంతిస్తే.. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవుతారు. లేదంటే.. బీసీ నేతకు అవకాశం రావొచ్చు.