అల.. ఓటీటీ రికార్డ్ !

ఓటీటీలో విడుదలైన సినిమా హిట్టా ? ఫట్టా ?? అన్నది సరిగ్గా చెప్పలేం. కేవలం టాక్ మాత్రమే తెలుస్తోంది. బాగుంది. బాగులేదు అంతే. ఓటిటిలో విడుదలయిన సినిమాను ఎంత మంది చూశారు అన్నది ఎవ్వరికీ తెలియదు.కేవలం ఆ సినిమా నిర్మాతకు కొంత వరకు తెలియవచ్చు. ఓటిటి లు స్వయంగా ప్రకటించవు.

అయితే 2020 లో సౌత్ నుంచి తమ ఓటిటి లో విడుదలై, టాప్ హిట్ లు గా నిలిచిన సినిమాల పేర్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు గాను ‘అల వైకుంఠపురములో’ టాప్ హిట్ గా నిలిచింది. తరువాత స్థానంలో దుల్కర్ సల్మాన్-రీతూ వర్మ నటించిన కనులు కనులను దోచాయంటే మలయాళ వెర్షన్ వుంది. మూడో స్థానంలో మలయాళ సినిమా కప్పెల వుంది. మరో తెలుగు సినిమా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కూడా టాప్ టెన్ లో చోటు తెచ్చుకుంది.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే హీరోయిన్, నభా నటాషా, టబు, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా పాటలు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. లెక్కలేనని రికార్డులని ఖాతాలో వేసుకున్నాయి. ఇక త్రివిక్రమ్ స్టయిల్ లో సాగిన అల.. వైకుంఠపురంలో అద్భుమైన సినిమా అనిపించుకుంది. భారీ లాభాలని తెచ్చిపెట్టింది.