ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఢిళ్లీ వెళ్లారు. మూడ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులని సీఎం కేసీఆర్ కలవనున్నారు. దీర్ఘకాలికంగా పెండిగ్లో ఉన్న పలు సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ప్రధానితో భేటీలో కేసీఆర్ ఏయే అంశాలని ప్రస్తావించనున్నారు అన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భాజాపా-తెరాసల మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ ని తగ్గించేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్రానికి సీఎం కేసీఆర్ అమూల్యమైన సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ? రైతులని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సీఎం కేసీఆర్ కు తెలుసని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.