ఎఫ్3 కోసం అరడజను హీరోయిన్లు !

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సీక్వెల్ గా ఎఫ్3 రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ‘ఎఫ్3’లో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ కాబోతోంది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించే అవ‌కాశం ఉంది. మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఎఫ్3లో మెరవనున్నారట.

వెంకీ సరసన ఇద్దరు, వరుణ్ తేజ్ సరసన ఇద్దరు  హీరోయిన్స్ నటించనున్నారు. దీంతో ఎఫ్3 హీరోయిన్స్ సంఖ్య నాలుగుకి చేరింది. మరోవైపు వెంకీ, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా ఎఫ్ 3లో ఉండనున్నారు. దీనికోసం రవితేజ, సునీల్.. తదితర పేర్లు ప్రచారంలో వచ్చాయ్. అదే నిజమైతే.. వారి పక్కన మరో హీరోయిన్ అవసరం. ఓ ఐటమ్ సాంగ్ ని కూడా ఉండనుంది. ఈ సాంగ్ లో చిందేయడానికి ఓ హాట్ బ్యూటీని తీసుకోనున్నారు. మొత్తానికి ఎఫ్ 3లో హీరోయిన్స్ సంఖ్య దాదాపు అరడజను అన్నమాట.