‘సోలో బ్రతుకు సో బెటర్’ టైటిల్ సాంగ్ వచ్చేసింది !

కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకు సో బెటర్’. నభా నటాషా హీరోయిన్. తాజాగా ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని విడుదల చేశారు. ‘సాటి సోలో సోదరసోదరీమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే… సోలో బ్రతుకే సో బెటర్. మన సింగిల్స్ అందరికీ అంకితం’ అంటూ ఈ టైటిల్ సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు తేజు.

‘సోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బతుకే సో బెటర్’ అంటూ ఈ పాట ప్రారంభం అవుతుంది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.Vishal Dadlani ఆలపించారు. థమన్ సంగీతం అందించారు. ఈ  సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది.