బీజేపీకి మేయర్ పదవి ఆఫర్ చేసిన టీఆర్ఎస్

టీఆర్ఎస్ నేతలు ఊహించినట్టు గ్రేటర్ ఎన్నికలు వన్ సైడ్ కాలేదు. బీజేపీ గట్టిగా పోటీ కొచ్చింది. ఎంఐఎం తమ స్థానాలని కాపాడుకుంది. మొత్తంగా తెరాస 56, భాజాపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలని గెలుచుకుంది. తెరాసకు ఒంటిరిగా మేయర్ పదవిని దక్కించుకొనే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఏదైనా ఇబ్బంది అయితే ఎంఐఎం సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. దీంతో తెరాసకు మేయర్ పదవి ఖాయం.

ఈ నేపథ్యంలో దాని కోసం భాజాపా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అయితే తెరాస నే భాజాపాకు మేయర్ సీటు ఆఫర్ చేసిందనే రూమర్ ఒకటి బయటికొచ్చింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కేసీఆర్ తెలంగాణ భాజాపాకు మేయర్ ఆఫర్ చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. తాము ముందు నుంచి చెబుతున్నట్టు తెరాస-భాజాపా ఒక్కటేనని వారు ఆరోపిస్తున్నారు. మరీ.. నిజంగానే కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టు హైదరాబాద్ మేయర్ పదవిని కేసీఆర్ భాజాపాకు ఆఫర్ చేసి ఉంటారంటారా !!??