మోనాల్’తో బ్రేకప్.. బిగ్ బాస్’కు మరో ఆప్షన్ లేదు !

మోనాల్ గజ్జర్ తో బిగ్ బాస్ ప్రేమలో పడ్డారు. అందుకే ఆమెని ప్రతివారం కాపాడుతూ వస్తున్నారనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మోనాల్ కోసం ప్రతివారం ఒక్కని బలి చేస్తున్నారని ప్రేక్షకులు ఆగ్రహంతో ఉన్నారు. కుమార్ సాయి ఎలిమినేట్ అయిన సమయంలోనే మోనాల్ ఎలిమినేట్ కావాల్సింది. ఆ తర్వాత కూడా లాస్య, మెహబూబ్ లని మోనాల్ కోసం బలి చేశారు.

ఇంకా ధైర్యం చేసి మోనాల్ ని ఫైనలిస్ట్ లిస్టులో పంపిద్దామనే చర్చలు కూడా జరిగాయట. కానీ అదే చేస్తే ప్రేక్షకుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుందని ఆగిపోయారు. ఫైనల్ గా మోనాల్ కి బిగ్ బాస్ బ్రేకప్ చెప్పేశారు. ఆమెని ఎలిమినేట్ చేశారు. దీంతో అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక, అరియానా ఫైనల్ కి చేరారు. వచ్చే ఆదివారం బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ విజేతగా నిలవనున్నారు.