అన్నాత్తె.. రజనీ లుక్ లీకు ! 

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తె’. శివ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో రజనీకాంత్ కూడా పాల్గొంటున్నారు. అయితే సెట్స్ లో ఆయన కూర్చున్న పిక్ ఒకటి బయటికొచ్చింది. దీంతో.. అన్నాత్తెలో రజనీ లుక్ లీకైనట్టయింది. ఇందులో పంచె కట్టుకొని.. ఖద్దరు చొక్కా ధరించి దర్జాగా కూర్చిలో కూర్చొని కీర్తి సురేష్ తో మాట్లాడుతున్నారు.

ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ కూల్ గా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా..ఆయన స్థాపించబోయే రాజకీయ పార్టీ గురించి తమిళనాడు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ నెల 31న రజనీ పొలిటికల్ పార్టీపై ప్రకటన చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలో పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. దీంతో.. రజనీ జెండా-అజెండా ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.