ఢిల్లీలో కేసీఆర్’ని ఎవరూ దేకలేదా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. మూడ్రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విన్నవించారు. విభజన చట్టంలోని అంశాలని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ కత్తులు దూసిన సంగతి తెలిసిందే. అవి ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లి.. భాజాపా పెద్దలతో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తెరాస-భాజాపా ఒక్కటే అంటున్నారు. సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం కాదు.. మోడీ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. మరీ.. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ భాజాపా నేతల స్పందన ఏంటీ అంటే.. ?
ఢిల్లీలో కేసీఆర్ ని ఎవ్వరూ నమ్మరని ఆ పార్టీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న కేసీఆర్‌కు ప్రధాన మంత్రి, హోంమంత్రితో పాటు ఇతర మం త్రులు అపాయింట్‌మెంట్ ఇచ్చారని, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవీనితి ఆరోపణలు త్వరలోనే నిరూపితమవుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని రాములమ్మ జోస్యం చెప్పారు.