మోనాల్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా ?

బిగ్ బాస్ తెలుసు సీజన్ 4 ముగింపునకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. విజేత ఎవరో తెలిసిపోనుంది. అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న వారి రెమ్యూనరేషన్ ఎంత ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. గత వారం ఇంటినుంచి ఎలిమినేట్ అయిన మోనాల్ కు బిగ్ బాస్ సెటిల్ మెంట్ చేసేశాడు. అదెంత ? అంటే అక్షరాల రూ.50లక్షలు అంటున్నారు.

బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరికీ వారానికి ఇంత అని రెమ్యూనిరేషన్లు వుంటాయన్న సంగతి తెలిసిందే. మోనాల్ రెమ్యూనిరేషన్ వారానికి మూడున్నర లక్షలట. అంటే దాదాపుగా యాభై లక్షల వరకు రెమ్యూనిరేషన్ దక్కిందన్నమాట. నిజానికి బిగ్ బాస్ విన్నర్ కు దక్కది కూడా యాభై లక్షలే. విన్నర్ కాకపోయినా మోనాల్ కు అంత మొత్తం వచ్చేసింది. విన్నర్ అయి వుంటే ఇంకా చాలా బహుమతులు దొరికేవి. అన్నట్టు బిగ్ బాస్ 4లో మోనాల్ కే ఎక్కువ రెమ్యూనరేషన్ అని తెలిసింది.