తిరుపతి కోసమే అమరావతి పాట ?
క్రమశిక్షణ గల పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది. కానీ ఇటీవల భాజాపాలో క్రమశిక్షణ లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ భాజాపాలో. ఏపీ రాజధాని విషయంలో భాజాపా అధిష్టానం మాట ఒకటి అయితే.. ఏపీ భాజాపా మాట మరోలా ఉంటుంది. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. అది రాష్ట్ర పరిధిలోని అంశం. అధికారిక వికేంద్రీకరణకు భాజాపా ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని కేంద్ర ప్రభుత్వం ఒకటిరెండు సార్లు స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ భాజాపా నేతలు మాత్రం అమరాతికే భాజాపా ఓటు అంటున్నారు.
కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ భాజాపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే పాట పాడారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇదే పాట పాడుతున్నారు. శుక్రవారం అమరావతిలో మాట్లాడిన సోము.. మోడీ మనిషిగా చెబుతున్నా.. అమరావతినే ఏపీ రాజధానిగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో భాజపా అధిష్టానం మాటకు విలువలేదని.. భాజాపాలోనూ క్రమశిక్షణ లోపిస్తుందని.. భాజాపా కూడా మరో కాంగ్రెస్ లా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే సోము వీర్రాజు అమరావతి పాట పాడటం వెనక తిరుపతి ఉప ఎన్నికనే కారణమని చెబుతున్నారు. ఎందుకంటే ? రాయలసీమ ప్రజలు అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలంటే అమరావతి పాట తప్పదని ఏపీ భాజాపా ఆ పని చేస్తుందని చెబుతున్నారు.