తెలంగాణలో 536 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 536 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,79,135కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,502కి చేరింది.

కరోనాబారి నుంచి నిన్న 622 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,70,450కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,041 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.