మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి

మెగా పెళ్లి సందడి ఇటీవలే  ముగిసింది.  నిహారిక-చైతన్యల వివాహంతో ఇటీవల మెగా వారింట్లో పెళ్లి బాజలు మోగిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అందరూ మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి అనుకుంటున్నారు. కానీ ఆయన కంటే ముందే అల్లు శిరీష్ పెళ్లి జరగనుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజు పెళ్లిపై తేజు స్పందించారు.

‘శిరీష్‌ నాకంటే పెద్ద. తను వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్దకొడుకుగా నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. పైగా పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి ఎన్నో మిస్‌ అయ్యాను. చాలా కలలున్నాయి. ముందు వాటిని నెరవేర్చుకోవాలి’ అని తేజు సమాధానం ఇచ్చారు’ ఇచ్చారు.