వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని ప్రారంభించిన కేటీఆర్
వనస్థలిపురం భవాణి నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 324 ఇళ్లని లబ్ధిదారులకి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పేదల ఇళ్లు అంటే అందులో అన్నీ వసతులు ఉండాలని సీఎం కేసీఆర్ ఇలాంటి ఇళ్లని కట్టిస్తున్నారు. దేశంలోనే ఇలాంటి ఇళ్లని ఏ రాష్ట్ర ప్రభుత్వం కట్టించలేదన్నారు. ఇదే స్థలంలో ఏ ప్రయివేటు బిల్డర్ కడితే.. రూ. 40-50 లక్షలు ఉంటుందని గుర్తు చేస్తున్నానన్నారు.
దేశంలోని మహానగరాలైన బెంగళూరు, కోల్ కతా, ముంబై తదితర ఏ మహానగరాల్లో ఇలాంటి కార్యక్రమం లేదు. ఈ సందర్భంగా ఇళ్లు కేటాయించిన వారికి మంత్రి కేటీఆర్ కొన్ని సూచనలు చేశారు. ఇళ్లు బాగుంటే సరిపోదు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల మధ్యలో చెత్త వేయకూడదు. పారిశుధ్యం ముఖ్యమని తెలిపారు.
Live: Minister @KTRTRS speaking after inaugurating 2BHK Dignity Houses at Bhavani Nagar in Vanastalipuram https://t.co/UfhzbEOYN8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 16, 2020