బిగ్ బాస్ విన్నర్.. షాకింగ్ ట్విస్ట్ ! 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి లేదా యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలుస్తోంది. వీరి చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ ట్రోఫిని అందుకున్నారు. అయితే ఆ విన్నర్ గా నిలిచేది ఎవరు ? అన్నది చర్చ జరుగుతోంది. అభిజిత్ కు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

అభిజిత్ కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. అభిజిత్ విన్నర్ కాకపోతే మాత్రం అఖిల్, సోహైల్ లో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. అయితే బిగ్ ట్విస్ట్ ఇస్తూ హారిక బిగ్ బాస్ విన్నర్ గా నిలవబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి వరకు నమోదైన ఓటింగ్ లో హారిక ముందుంది. ఆమె తర్వాత అఖిల్, సోహైల్, అభిజిత్ లు ఉన్నారని చెప్పుకొంటున్నారు.