వకీల్ సాబ్.. మరో పిక్ లీక్ !


‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్ హిట్ ‘పింక్’కి రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ముందు ఏపీలో పర్యటన.. ఆ తర్వాత నిహారిక పెళ్లికి వెళ్లొచ్చిన పవన్ తిరిగి వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా నిజాం కళాశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ లోకేషన్‌లో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.