‘ఎఫ్3’ క్లాప్ పడింది

ఎఫ్2 – అసలు సిసలు సంక్రాంతి సినిమా ఎలా ఉండాలో చూపించింది. 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అత్యధి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ఎఫ్ 3 రాబోతుంది. తాజాగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 23 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సీక్వెల్ లోనూ వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఉండనున్నారు. అదనంగా మరో హీరోని తీసుకోనున్నారని చెబుతున్నారు. మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా కనిపించబోతున్నారు. సీక్వెల్ లో వెంకీ, వరుణ్ ల పక్కన ఇద్దరు  హీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ. 80కోట్ల బడ్జెట్ ఖర్చుపెట్టబోతున్నారని తెలుస్తోంది.