నిహారిక పెళ్లికి గైహాజరు.. పవన్ భార్యల వివరణ !
ఈ నెల 9న ఉదయ్ పూర్ లో మెగా డాటర్ నిహారిక పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడ్రోజుల ముందే అక్కడి చేరుకున్న మెగా ఫ్యామిలీ సరదాగా గడిపింది. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిల్లలతో కలిసి హాజరయ్యారు. అయితే పవన్ తాజా, మాజీ భార్య రాకపోవడంపై చర్చలు జరిగాయి. తాజాగా నిహారిక పెళ్లికి రాకపోవడంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. షూటింగ్ ఉండటంతోనే తను పెళ్లికి రాలేకపోయా. తాను రాకపోయినా పిల్లలను పంపించానని రేణు సన్నిహితుల దగ్గర చెప్పిందట.
ఇక పవన్ భార్య అన్నా లెజినోవాని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. క్రిస్మస్కు ముందు రష్యాకు వెళ్లి అక్కడ నెల రోజుల పాటు ఉండి పండుగ పూర్తైన తర్వాత ఇండియాకి వస్తుంటుంది అన్నా. ఈ సారి అదే చేసింది. అన్నా.. ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఈ సింగిల్ పిక్ తో నిహారిక పెళ్లికి రాకపోవడంపై ఆమె వివరణ ఇచ్చినట్టయింది.