‘ఆచార్య’లో చరణ్ అతిథి కాదు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అయితే ఆయనది అతిథి పాత్ర. కొన్ని నిమిషాల పాత్రలో ఆయన మెరుస్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా చరణ్ పాత్రపై కొరటాల క్లారిటీ ఇచ్చారు.

ఆచార్యలో రామ్ చరణ్ అతిథి కాదు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. పవర్ ఫుల్ గా ఉందనుందని తెలిపారు. ఇక మెగాస్టార్ తో సినిమా చేస్తుంటే నా కల నిజమైనట్టు అనిపిస్తోంది. ఇంత అనుభవం ఉన్నప్పటికీ ప్రతి షాట్, సీన్ విషయంలో చిరంజీవి కచ్చితంగా ఉంటారు. ఇప్పటికీ ఎంతో కష్టపడతారు. ఆయనకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉందని చెప్పుకొచ్చారు.