మహేష్’తో సుకుమార్ శిష్యుడు

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన‌’తో ద‌ర్శ‌కుడిగా మారాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌యిపోయి, ఈ సినిమాపై అంచ‌నాల్ని విప‌రీతంగా పెంచేశాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిక కృతి శెట్టి అయితే, ఇప్ప‌టికే నాలుగైదు సినిమాల్ని త‌న ఖాతాలో వేసేసుకుంది. బుచ్చిబాబుపై కూడా నిర్మాత‌లు, హీరోల దృష్టి ప‌డింది. ఇప్ప‌టికే మైత్రీ మూవీస్ బుచ్చిబాబుతో మరో సినిమా కోసం ఎగ్రిమెంట్ చేసుకుంది.

అయితే బుచ్చిబాబు మాత్రం సూపర్ స్టార్ మహేష్ వైపు చూస్తున్నారు. మహేష్ కోసం ఓ క‌థ రెడీ చేసుకున్నాడ‌ని స‌మాచారం. `ఉప్పెన‌` హిట్ట‌యితే.. వెంట‌నే మ‌హేష్ ని క‌ల‌వాల‌న్న‌ది త‌న ఆశ‌. రెండో సినిమాకే బుచ్చిబాబు మహేష్ ని టార్గెట్ గా పెట్టుకోవడం గొప్ప విషయమే. మహేష్ నిమెప్పించడం అంత ఈజీ మాత్రం కాదు. అయితే ఉప్పెన హిట్ అయితే మహేష్ దృష్టిలో బుచ్చిబాబు పడటం ఖాయం.