తేజుతో సుకుమార్ సినిమా

దర్శకుడు సుకుమార్ మెగా హీరోలని గుత్త పట్టినట్టున్నాడు. వరుసగా వారితో సినిమాలు చేస్తున్నాడు. రంగస్థలం తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు సుక్కు. మరోవైపు తన శిష్యులని రంగంలోకి దింపి మెగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజు తప్పుడు వైష్ణవ్ ‘ఉప్పెన’ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుక్కు కథ అందించారు. అతడి శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు తేజుతోనూ సుక్కు ఓ సినిమా ప్లాన్ చేశాడట. ఇదో థ్రిల్లర్ అని తెలుస్తోంది. అయితే డ్ర‌గ్స్ మాఫియా నేప‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తోంది. కాక‌పోతే.. ఎమోష‌న్, డ్రామా, క్యారెక్ట‌రైజేష‌న్ విష‌యంలో మాత్రం `రంగ‌స్థ‌లం` ఛాయ‌లు క‌నిపిస్తాయ‌ని స‌మాచారం. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వం వహించనున్నారు.