దిల్ రాజు బర్త్ డే.. అభిమానుల కడుపునింపేశాడు !

నిర్మాత దిల్ రాజు 50వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయ్. టాలీవుడ్ మొత్తం వాలీపోయింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగ చైతన్య-సమంత దంపతులు తదితరులు బర్త్ డే పార్తీకి హాజరయ్యారు. టాలీవుడ్ టాప్ హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించి సందడి చేశారు.

దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వారిని అలా ఒకే ఫ్రేములో చూసుకొని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దిల్ రాజు కూతురుతో ప్రభాస్ సరదాగా ముచ్చటించారు. ఫంక్షన్లకి పెద్దగా రాని పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ గెటప్ లో విచ్చేశారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగలేదని చెప్పవచ్చు.