హైదరాబాద్’లో గంగవ్వ హల్ చల్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో గంగవ్వ చేసిన హంగామా అంతా.. ఇంతా కాదు. మొదటి ఒకట్రెండు వారాలైతే గంగవ్వనే షోని ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత మిగితా కంటెస్టెంట్స్ ఫామ్ లోకి వచ్చారు. వినోదాన్ని పంచారు. అయితే బిగ్ బాస్ ఇంట్లో వాతావరణం పడక.. గంగవ్వ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ షో పాల్గొనందుకు తన కోరిక మాత్రం తీర్చుకుంది గంగవ్వ. ఆమె ఇల్లు కట్టిస్తానని నాగ్ హామీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు గంగవ్వ ఇంటికి వెళ్లి పలకరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జోర్థార్ సుజాత, లాస్య ఇంటికి వెళ్లారు. గంగవ్వతో సరదాగా గడిపారు. అయితే ఇప్పుడు గంగవ్వ హైదరాబాద్ కు వచ్చింది. ఆదివారం జరగనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలెలో పాల్గొననుంది. ఫినాలెకి మరో రెండ్రోజుల టైమ్ ఉండటంతో గంగవ్వ హైదరాబాద్ లో విహరిస్తోంది.

ఓ బంగారం షాపులో నగలు కొనుక్కుంది. ఇక ఈరోజు గంగవ్వను మెహబూబ్ తన ఇంటికి ఆహ్వానించాడు. అవ్వ కోసం బిర్యానీ చేపించాడు. అంతేకాదు.. అవ్వ కోసం 25 తులాలతో పట్టీలు చేయించి బహుమతిగా ఇచ్చారు. మొత్తానికి.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె లో పాల్గొనే ముందు గంగవ్వ హైదరాబాద్ లో హల్ చల్ చేస్తోంది. ఇక ఆదివారం గ్రాండ్ ఫినాలె లో గంగవ్వ లాస్ట్ పంచ్ లు ఎలా ఉంటాయో చూడాలి.