తాప్సీ కష్టం చూశారా ?
సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ పెద్దగా కలిసిరాలేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఆమెకు బాగా కలిసొచ్చింది. అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. మహిళా ప్రాధాన్యత సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘రష్మి రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో ప్రియాన్షు పెన్యూలీ నటించారు.
ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోకస్ పెడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు పెద్దగా జిమ్‌లో గడపని ఆమె.. ఈ చిత్రం కోసం ప్రత్యేక కసరత్తులు నేర్చుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ‘నో స్టెరాయిడ్స్’ అనే నియమం పెట్టుకున్నానని, సహజమైన పద్దతుల ద్వారా తన శరీరాన్ని ఎంత ధృడంగా మార్చుకుందో తెలియచేస్తూ.. దీనికి సంబంధించి ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ వీడియోను తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుఅకున్నారు. ఆర్డినరీ మనుషులు ఎక్స్‌ట్రార్డినరీ పనులు చేయాల్సి ఉంటుందంటూ ట్యాగ్‌లైన్‌ను జతచేసింది.