దివిలో టాలెంట్ ఫుల్.. కసి నిల్ !

టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ టాలెంట్ ని నిరూపించుకోవాలన్న కసి కూడా ఉండాలి. అప్పుడే ఎదుగుతాం. బిగ్ బాస్ కంటెస్టెంట్ దివిలో బోలేడు టాలెంట్ ఉంది. వాస్తవానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఫస్ట్  హిట్ అయింది దివినే. ఇంటి సభ్యుల గురించి తనదైన శైలిలో ప్రజెంట్ చేసి ఆకట్టుకుంది. హీరోయిన్ కి కావాల్సినంత మెటిరీయల్ ఆమె సొంతం. తెలివైన పిల్ల. కానీ.. కసి లేక బిగ్ బాస్ ఇంటి నుంచి త్వరగానే బయటికొచ్చేసింది. లేదంటే టాప్ – 5లో ఉండేది. అయినా.. ఆమెని అదృష్టం వరించింది. మెగా ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.

ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో దివిని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆమెకి తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లూసిఫర్ తెలుగు రిమేక్ లో ఆమెకి ఓ పాత్రని ఆఫర్ చేశారు. అది పోలీస్ పాత్ర. మరో 9 నెలల్లో దివితో కలిసి నటించబోతున్నానని చిరు బిగ్ బాస్ వేదికగా ప్రకటించారు. దీంతో దివి ఆనందానికి అవధుల్లేవ్. అయితే దివి కాస్త ఆకలితో ఉంటే.. కసి పెంచుకుంటే.. మరిన్ని ఆఫర్లు రావొచ్చు. మెహబూబ్ నే చూడండి.. మొదట్లో కన్ఫూజన్ కి కెరాఫ్ అడ్రస్ లా ఉండేవాడు. అతడిలో కాన్ఫిడెన్స్ కనిపించలేదు. కానీ కసితో ఎదిగాడు. మెహబూబ్ లో తనని తాను చూసుకున్నానని మెగాస్టార్ చిరంజీవి చేత ప్రశంసలుఅందుకున్నారు. ఇలాంటి కసి దివిలో ఉంటే.. ఆమె స్టార్ కావడం ఖాయం.