యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్
యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని సహాయంతో ఒక డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోలను మరో డివైజ్‌లోని డౌన్‌లోడ్స్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు మీ ఫోన్‌లో యూట్యూబ్ నుంచి వీడియో డౌన్‌లోడ్ చేశారు. అది డివైజ్‌లో సేవ్ అయ్యేప్పుడు మీకు స్క్రీన్ మీద పాప్-అప్ విండో ప్రత్యక్షమవుతుంది. అందులో మీరు లాగిన్ అయిన డివైజ్‌ల జాబితా చూపిస్తుంది.
అందులో ఒకటి లేదా మొత్తం డివైజ్‌లను సెలెక్ట్ చేస్తే వీడియో వాటిలో కూడా సేవ్ అవుతుంది. ఇందుకోసం మీ డివైజ్ సెట్టింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అండ్ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి క్రాస్ డివైజ్ ఆఫ్‌లైన్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్స్‌కి మాత్రమే పరిమితమని తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పటికే పలువురు ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.