మరో కొత్తరకం వైరస్.. నాలుగు దేశాల్లోలాక్ డౌన్ !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని గజగజ వణికించింది. దాని ప్రభావం క్రమంగా తగ్గుతుంది. త్వరలోనే కరోనా నుంచి విముక్తి లభించనుందని సంతోషిస్తున్న టైమ్ లో మరో పిడుగులాంటి వార్త. కొత్తరకం వైరస్ స్టెయిన్ వెలుగులోకి వచ్చింది. ఇది కరోనా కంటే భయం కరమైనది చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో బ్రిటన్ సహా, ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలవుతోంది.

బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో స్ట్రెయిన్ వ్యాపిస్తున్నట్టు నిర్ధారణ కావడంతో.. ఆ రెండు దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులపై బెల్జియం, నెదర్లాండ్స్ నిషేధాజ్ఞలు విధించాయి. తాజాగా జర్మనీ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాలకు ఇతర ప్రపంచ దేశాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది. జర్మనీ అధికారులు స్ట్రెయిన్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ప్రస్తుతానికి జర్మనీలో స్ట్రెయిన్ ఆచూకీ లేకపోయినా.. బ్రిటన్ నుంచి తమకు ముప్పు పొంచి ఉందనే భయంతో ఇతర దేశాలు వణికిపోతున్నాయి.