రెడ్ రిలీజ్ డేటు ఫిక్స్


ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. ఈ యేడాది ఏప్రిల్ లోనే రెడ్ రిలీజ్ కావాల్సివుంది. కానీ కరోనా విజృంభణతో వాయిదా పడింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినా వాటిపై చిత్ర బృందం స్పందించలేదు.

తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే ఎంతో పాపులర్‌ అయ్యాయ్.  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ.. అంచనాలని రెడ్ అందుకుంటుందా ? తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.