కొత్తరకం కరోనా వైరస్ పై WHO స్పందన
బ్రిటన్ లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే ఐరోపాలోని పలు దేశాలు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమానాలను రద్దుచేయగా, తాజాగా కెనడా కూడా యూకేకు నడిచే విమాన సర్వీసులను నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) స్పందించింది. ‘యూకే అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతున్నాం. వారు చేస్తోన్న పరిశోధనలు, విశ్లేషణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు. వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మాకు అందిన వెంటనే దాన్ని ప్రజలకు వెనువెంటనే చేరవేస్తాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.